NTV Telugu Site icon

Priyanka Gandhi: భవిష్యత్ లో బీఆర్ఎస్ ను మ్యూజియంలో చూస్తారు..

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: బీఆర్ఎస్ ను భవిష్యత్ లో మ్యూజియంలో చూస్తారని ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచార కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఎవరి భాగస్వామ్యం లేకున్నా మానవత్వంతో సోనియా గాంధీ ఇచ్చారని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఇచ్చారు తెలంగాణ అని తెలిపారు. గత 10 ఏళ్లలో ఒక్క హైదరాబాద్ లో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు.

Read also: Health Tips : పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

యువకులను ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. TSPSC అవినీతికి పాల్పడింది, పేపర్లు అమ్ముకున్నారన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. సామాజిక న్యాయం లేదు తెలంగాణలో అని మండిపడ్డారు. ఒక్క నలుగురుకు మాత్రమే ఉద్యోగం దొరికిందని అన్నారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రమే ఉపాధి దొరికిందన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ లు కోరుకుంది ప్రజల తెలంగాణా అన్నారు. ఫార్మ్ హౌస్ తెలంగాణ కాదన్నారు. తెలంగాణలో పీడిత ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలకు టాటా బాయ్ బాయ్ చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ను భవిష్యత్ లో మ్యూజియంలో చూస్తారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే మేనిఫెస్టో మా కాంగ్రెస్ గ్యారెంటీ కార్డని తెలిపారు.
Pariksha Pe Charcha: పరీక్షపై చర్చ కోసం రిజిస్ట్రేషన్స్.. మోడీతో మాట్లాడే ఛాన్స్..