Site icon NTV Telugu

Fire Accident in Nirmal: బస్సులో మంటలు.. 26 మంది ప్రయాణికులు

Nirmal

Nirmal

Fire Accident in Nirmal: నిర్మల్‌ జిల్లాలో బస్సులో మంటలు చెలరేగాయి. సోన్‌ మండలం గంజాల్‌ టోల్‌ ప్లాజా వద్ద ఇవాళ తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్‌ ఉన్నారు. మంటలు వ్యాపించగానే అప్రమత్తమై అందరూ కిందకు దిగారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన బస్సు నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నట్లు డ్రైవర్‌ తెలిపారు. ఈప్రమాదం షాట్‌ సర్క్యూట్‌ కారణంగానే బస్సులో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగటంతో ఎల్‌హెచ్‌ 40 ఏటీ 9966 బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులో తీసుకొచ్చారు.

Exit mobile version