Site icon NTV Telugu

PM Modi: నేడు తెలంగాణకు మోడీ.. జహీరాబాద్, మెదక్ లో ప్రధాని ప్రచారం..

Pm Modi

Pm Modi

PM Modi: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లాలోని అల్లా దుర్గం ఐబీ స్క్వేర్‌లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోడీ ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు అసెంబ్లీ వేదిక వద్దకు చేరుకుని ప్రసంగించనున్నారు.

Read also: TS SSC Results 2024: నేడే టెన్త్‌ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల

దీంతో ప్రధాని మోడీ సభకు మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నుంచి రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా. బీజేపీ శ్రేణులు వేసవికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. సభకు వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందిలేకుండా మంచి నీటి సదుపాయం కల్పించారు. కూర్చునేందుకు సదుపాయం కల్పించారు. మోడీ సభలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సభ సజావుగా సాగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జహీరాబాద్, మెదక్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ రూట్స్ మార్చినట్లు తెలిపారు. వాహనదారులు గమనించాలని, పోలీసులకు సహకరించి ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని కోరారు.

Read also: T20 World Cup 24: రాహుల్, గిల్‌లకు నో ప్లేస్.. కీపర్‌గా సంజూ! భారత జట్టు ఇదే

వచ్చే నెల 8న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మోడీ ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం పంపింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు… ఆరోజు ఉదయం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో పర్యటిస్తారు. ప్రధాని రాక సమాచారాన్ని అందుకున్న జిల్లా నాయకత్వం సభాస్థలి, ఏర్పాట్లపై ద్రుష్టి సారించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి వేములవాడ రానున్న నేపథ్యంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఎములాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 10 గంటలకు రాజన్న దర్శనాంతరం ఎములాడలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు హాజరై మోడీ ప్రసంగించేలా షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్ రెండు, మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది.
Gaza: రాఫాపై వైమానిక దాడి.. 22 మంది మృతి

Exit mobile version