PM Modi: అవినీతిని నేను ఒప్పుకోను.. అవినీతి పరుల పట్ల కఠినంగా వ్యవహరిద్దామా? వద్దా? అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రియమైన సోదర సోదరీ మణులారా.. మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదు.. కుటుంబ పాలన అన్ని వ్యవస్థలు తన కంట్రోల్ లో ఉండాలని అనుకుంటుందని తెలిపారు. అవినీతి లేకుండా డీబీటీ ద్వారా అన్ని వర్గాలకు సాయం అందిస్తున్నామన్నారు. డిజిటల్ పేమెంట్ వల్ల అవినీతి అక్రమాలకు తావుండదని తెలిపారు. తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందడుగు.. వందేభారత్ రెండవ ట్రైన్ ప్రారంభించామన్నారు.
Read also: Akhira: నాన్న రాజకీయాల్లోకి, కొడుకు సినిమాల్లోకి… ఆరడుగుల బుల్లెట్ ఎంట్రీ ఎప్పుడు?
భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామిని చేరుకునేలా రైలు సర్వీస్ ని అనుసంధానించామని తెలిపారు. 11 వేల కోట్ల ప్రాజెక్టులకు అంకురార్పణ, జాతికి అంకితం చేశాం.. రైల్, రోడ్ కనెక్టివిటీ, హెల్త్ ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకార లేక పోవడంతో ప్రాజెక్ట్ లు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో వేగం పెంచండి.. స్వార్థం కోసం చూసుకుంటున్నారని తెలిపారు. MMTS విస్తరణ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు ఇది కొత్త బిజినెస్ హబ్, పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా రైల్వే సర్వీసులు చేపట్టామని, రైల్వే ప్రాజెక్టుల విస్తరణ వల్ల చుట్ట పక్కల ప్రజలకు ఉపయోగమన్నారు. గడచిన 9 ఏళ్ళలో హైదరాబాద్ లో 75 కిలోమీటర్ల నెట్ వర్క్ నిర్మించామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
Read also: Konda Vishweshwar Reddy: ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించ లేదు
వందే భారత్ ట్రైన్ భాగ్యలక్ష్మి దేవాలయంను వేంకటేశ్వర దేవాలయము ను అనుసంధానం చేస్తుందన్నారు. తెలంగాణ కు ఏర్పడినప్పుడే కేంద్రం లో nda అధికారం లోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజల కన్నా కలలు నెరవేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఎంఎంటీఎస్ కోసం 600 కోట్లు కేంద్ర బడ్జెట్ లో పెట్టామన్నారు. 70 కిలో మీటర్ ల మెట్రో రైల్ ప్రారంభం అయిందని, దేశంలో మౌళిక వసతుల కోసం కేంద్రం 10 లక్షల కోట్లు కేటాయించామన్నారు. తెలంగాణ లో రైల్వే బడ్జెట్ చాలా రెట్లు పెరిగిందని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్నట్లుగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుటుంబ పార్టీలు సామాన్యుల రేషన్ కూడా దోచుకుంటున్నాయని అన్నారు. రాబోయే 25 ఏండ్లలో దేశంతో పాటు తెలంగాణకు కూడా ముఖ్యమే అని తెలిపారు. సంతుస్టికరణ, అవినీతి లేకుండా చూసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలను నిజం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
PM Modi Public Meeting LIVE : ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ లైవ్
