NTV Telugu Site icon

PM MODI: దీపావళికి దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి.. నమో యాప్‌లో సెల్ఫీలు పెట్టాలని సూచన

Pm Modi

Pm Modi

PM MODI: దేశ ప్రజలకు ప్రధాని మోడీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈసారి దీపావళి సందర్భంగా దేశ ప్రజలు స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా వాటితో ఫొటోలు దిగాలని సూచించారు. ఆ చిత్రాలను నమో యాప్‌లో అప్‌లోడ్ చేయాలని హితవు కోరారు. దీంతో ప్రధాని మోడీ ఇచ్చిన స్పందనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘లోకల్ ఫర్ వోకల్’ నినాదానికి మద్దతుగా ఈ దీపావళికి దేశ ప్రజలందరూ స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దీపావళి సందర్భంగా స్థానికంగా తయారు చేసిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లోకల్ ఫర్ వోకల్ కు మద్దతుగా నిలవాలని కోరారు.

ఈ దీపావళికి, ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువులతో సెల్ఫీలు తీసుకుని, వాటిని నమోయాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ ఏడాది దీపావళిని భారతదేశ సృజనాత్మక స్ఫూర్తితో, వ్యాపార సామర్థ్యంతో జరుపుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. ఆ ఉత్పత్తులతో సెల్ఫీలు తీసుకుని నమో యాప్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను చేర్చుకోవాలని పేర్కొన్నారు. స్థానిక ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి,భారతదేశ సంప్రదాయాన్ని పెంపొందించడానికి డిజిటల్ మీడియా శక్తిని ఉపయోగిస్తామని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్‌పై వెంటనే స్పందించారు.

పోస్ట్ చూసిన నెటిజన్లు తాము ఇప్పటికే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేశామని చెప్పారు. వాటికి సంబంధించిన చిత్రాలను కూడా అక్కడ పోస్ట్ చేశారు. గత నెలలో మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాను గతంలో ఇచ్చిన పిలుపు కారణంగానే దసరా పండుగకు దేశ ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశారన్నారు. ఈ స్ఫూర్తితో మన దేశంలో తయారైన ఉత్పత్తులను ప్రతి పండుగ రోజు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లోకల్ ఫర్ వోకల్ అనే నినాదానికి ఇది గొప్ప బలం చేకూరుస్తుందని ప్రధాని అన్నారు. దీనికి సంబంధించి ఈ దీపావళి పండుగ రోజున స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
Delhi AQI: ఢిల్లీలో విషపూరితంగా మారుతున్న గాలి నాణ్యత