Site icon NTV Telugu

టీఆర్‌ఎస్‌కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌


హోరాహోరిగా జరిగిన హుజురాబాద్‌ ఎన్నికలు మీనియుద్ధానే తలపించాయి. చివరకు విజయం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను వరించింది. ఈటల గెలుపుపై బీఎస్పీ కన్వీనర్‌, మాజీ IPS ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు.

అహంకారంతో, కక్షతో, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ టీఆర్‌ఎస్‌ పాలకులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి, బహుజన బిడ్డ ఈటల రాజేందర్‌ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న హుజురాబాద్‌ ప్రజలకు జేజేలు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరించినా తెలంగాణ మీకు లొంగదు గాక లొంగదు అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.

Exit mobile version