NTV Telugu Site icon

Prakash Ambedkar: హుజూరాబాద్ కు ప్రత్యేక చాపర్ లో బయలుదేరిన ప్రకాశ్ అంబేద్కర్

Praksha Ambedker

Praksha Ambedker

Prakash Ambedkar: దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 125 అడుగుల బాబాసాహెబ్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు, మాజీ ఎంపీ ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన బాబాసాహెబ్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ కు మంత్రి గంగుల కమలాకర్ ఘనస్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి దళిత బంధు జ్ఞాపికను అందజేశారు.

ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్‌తో పాటు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక చాపర్‌లో హుజూరాబాద్‌కు బయలుదేరారు. హుజూరాబాద్‌లో దళితబందు లబ్ధిదారులను కలుస్తారు. వారి అనుభవాలు, దళిత బంధు వారి జీవితాలలో వచ్చిన మార్పుల గురించి వారు తెలుసుకుంటారు. మంత్రి గంగుతో పాటు విప్ బాల్క సుమన్, ఇతర ఉన్నతాధికారులు ప్రకాష్ అంబేద్కర్‌ను హుజూరాబాద్ దళితబందు లబ్ధిదారుల వద్దకు తీసుకెళ్లి, పర్యటన అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు.

Read also: Pharmacy Employ Typing : అమ్మో అదేం టైపింగ్ రా బాబు.. కీ బోర్డ్ ను గడగడలాడించిన ఫార్మసీ ఎంప్లాయ్

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 125 అడుగుల డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పలు మార్గాలు మూసివేయబడంతో పాటు దారి మళ్లించబడతాయి. నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌, ఐమాక్స్‌ మార్గాల్లో వచ్చే ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లో మళ్లిస్తామని, ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్క్‌లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్‌ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.
YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక వ్యక్తి అరెస్ట్..!

Show comments