Justice My Daughter: భారత రాష్ట్రపతి ద్రౌపధి ముర్ముకు.. వి.హెచ్.పి.నేత పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞ రెడ్డి లేఖరాశారు. రాష్ట్రపతి ఈ నెల 29న మీరు నారాయణమ్మ కాలేజీ ని సందర్శించునున్నారు నేపథ్యంలో ప్రజ్ఞరెడ్డి రాష్ట్రపతికి లేఖ సంచలనంగా మారింది. కాలేజీని నిర్వహిస్తున్న జి.రాఘవరెడ్డి ఆయన భార్య భారతి రెడ్డి వారి కుమార్తె శ్రీవిద్య రెడ్డిలు గత రెండేళ్లుగా తనని, తన కూతురు ని వేదిస్తున్నారంటూ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. మా ఇద్దరినీ చంపేందుకు ప్రయత్నించారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వరకట్నం కోసం తనని హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన 8ఏళ్ల కూతురుని ఇంటి నుంచి బయటకి రాకుండా రాత్రికి రాత్రే గదిబయట గోడ కట్టారని ఆరోపించారు. ఇవన్నీ నేను చేస్తున్న ఆరోపణలు కాదు, మీడియాలో అందరూ చూసారని పేర్కొన్నారు.
Read also: Ravi Venkateswara Rao: ఈసారి నేనే గెలుస్తా… నీ ఏడుపేదో నువ్వు ఏడువు నాని
కోర్ట్ కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిందని, గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించిందని గుర్తుచేశారు. దీంతో అధికారులు వచ్చి ఆ గోడ తొలగించారని లేఖలో పేర్కొన్నారు. తనకు, కూతురికి వున్న న్యాయమైన హక్కులను కాలరాస్తూ నన్ను బెదిరిస్తున్నారని, అత్త భారతి రెడ్డి పై ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అనేక భూ కబ్జా కేసులు నమోదై వున్నాయని పేర్కొన్నారు. ఒక మహిళగా మీరు నా పరిస్థితిని అర్ధం చేసుకుని నాకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నానని ఆలేఖలో వి.హెచ్.పి.నేత పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞ రెడ్డి కోరారు. ఇప్పటికే తమ influence తో మమల్ని, ధర్యాప్తు సంస్థలని బెదిరిస్తున్న రాఘవరెడ్డి, భారతి రెడ్డి శ్రీ విద్య రెడ్డి ఎకనాథ్ రెడ్డిలు. నారాయణమ్మ కాలేజీ విజిట్ తర్వాత మరింతగా మమ్మల్ని హెరాస్ చేస్తారేమోనని, దర్యాప్తు సంస్థలను influence చేస్తారని ఆందోళన చెందుతున్నానన్నారు. దయచేసి తనకు, తన కూతురికి న్యాయం చేయాలని ప్రజ్ఞ రెడ్డి లేఖలో కోరారు. మరి దీనిపై రాష్ట్రపతి ముర్ము స్పందించి ఆమెకు న్యాయం చేస్తారా? అనేది ఆశక్తిగా మారింది.
Sankranthi Movies: ‘వారిసు’కే ఎక్కువ థియేటర్స్… మూడు సినిమాల ప్రీబుకింగ్స్ స్టార్ట్!