Site icon NTV Telugu

Mahbubnagar Floods: వ‌ర‌ద‌లో చిక్కుకున్న పాఠ‌శాల బ‌స్సు.. బస్సులో 25 మంది విద్యార్థులు

Mahaboobnagar

Mahaboobnagar

గ‌త కొద్ది రోజులు భారీ వ‌ర్షాలు జ‌న‌జీవనాన్ని అత‌లాకుతలం చేస్తున్నాయి. వాన‌ల‌తో ప్ర‌జ‌లు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప‌గ‌లు, రాత్రి అనే తేడాలేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాన‌ల‌కు జిల్లాల్లో వాగులు వంగ‌లు నిండి ప‌రుగులు పెడుతున్నాయి. ఈనేప‌థ్యంలో.. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సుమాచన్‌పల్లి- కోడూరు మధ్య వరదలు ముంచెత్త‌డంతో రామచంద్రపురం నుంచి సూగూరు తండాకు వెళ్తుండగా ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అండర్‌బ్రిడ్జిలో భారీగా నీళ్లు పారుతున్నాయి. అదిగమనించకుండా డ్రైవర్ అలాగే బస్సును ముందుకు కదలించడంతో.. బస్సు వరదల్లో చిక్కికుంది.

దీంతో.. అక్క‌డ ప్రైవేట్ పాఠ‌శాల బ‌స్సు అండ‌ర్ బ్రిడ్జిలో నిలిచిపోయింది. దీంతో బ‌స్సులో నీరుచేరాయి. విద్యార్థులు భయాంతోళ‌న‌ల‌కు గుర‌య్యారు. బ‌స్సులో 25 మంది విద్యార్థులు వున్నారు. అయితే అక్క‌డున్న స్థానికులు గ‌మ‌నించి విద్యార్థుల‌ను డ్రైవ‌ర్‌, స్థానికులు క‌లిసి బ‌య‌ట‌కు సేఫ్ గా కాపాడారు. వ‌ర‌ద‌లో చిక్కుకున్న బ‌స్సును ట్రాక్ట‌ర్ స‌హాయంతో బ‌య‌టికి లాగారు. ఎవ‌రికి ఎటువంటి హానీ జ‌ర‌గ‌క పోవ‌డంతో విద్యార్థి త‌ల్లిదండ్రులు, స్థానికులు, ఊపిరిపీల్చుకున్నారు.

India Corona: దేశంలో కొత్తగా 18,815 కరోనా కేసులు.. 38 మంది మృతి

Exit mobile version