Site icon NTV Telugu

కరెంట్ బిల్లు షాక్‌: రూ.500 కూడా రాదు.. ఇప్పుడు రూ.1.2 లక్షలు దాటేసిందే..!

ప్రతీ నెల రూ.500 కూడా దాటదు.. కానీ, ఉన్నట్టుండి ఆ ఇంటి నెలవారి కరెంట్‌ బిల్లు లక్ష దాటేస్తే.. ఆ ఇంటి యజమానికి షాక్‌ తగిలినంత పని కాకపోతే.. ఇంకా ఏమవుతుంది.. సాంకేతిక లోపమో.. రీడింగ్‌ నమోదు చేయడంలో పొరపాటుతోనే కానీ.. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తేనే ఉంటాయి.. చిన్న ఇంటికి ఏకంగా లక్షల్లో బిల్లులు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా.. ప్రతీనెల రూ. 400 దాటని ఇంటికి కరెంటు బిల్లు రూ.1.21 లక్షలు రావడంతో ఆ ఇంటి యజమాని నివ్వెరపోయారు. తెలంగాణలోజరిగిన ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చేర్యాలలోని అభయాంజనేయస్వామి ఆలయ వీధి ఏకంగా ఓ ఇంటి నెల వారి కరెంట్‌ బిల్లు 1.21 లక్షలు దాటేసింది.. శుక్రవారం కరెంటు మీటరు రీడింగ్‌ తీశారు విద్యుత్‌ శాఖ సిబ్బంది.. 12,868 యూనిట్లు వినియోగించినట్టు రీడింగ్‌ సూచించింది.. ఇక బిల్లు ఏకంగా రూ.1,21,668గా వచ్చింది.. ప్రతీనెల రూ. 400 లోపు బిల్లు వస్తుందని, ఈ నెల ఏకంగా లక్షకుపైగా బిల్లు రావడంతో వినియోగదారుడు షాక్‌ తిన్నాడు.. ఈ విషయాన్ని విద్యుత్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో.. రీడింగ్‌లో ఎక్కువగా నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు.. మొత్తానికి ఈ వ్యహారం విద్యుత్‌శాఖలోని లోపాలని మరోసారి ఎత్తిచూపిస్తుండగా.. ఆ ఇంటి యజమానిని మాత్రం కలవరానికి గురిచేసింది.

Exit mobile version