Ponnam Prabhaskar Counters On PM Narendra Modi: ప్రధాని మోడీ ఫోటోతో దేశం అభివృద్ధి కాదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మిత్ర పక్షాలను చీల్చడం, వారిని బలహీనపరచడమే బీజేపీ పని అని మండిపడ్డారు. మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికే మోడీ మీటింగ్ పెట్టారని అన్నారు. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదని.. నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అని దుయ్యబట్టారు. లోకసభలో ప్రాధాన్యత లేనివాళ్ళు బీజేపీకి మిత్ర పక్షాలని ఎద్దేవా చేశారు. తాను బీసీ అని చెప్పుకునే ప్రధాని మోడీ.. బీసీ గణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ‘చక్ దే ఇండియా’ అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలు ముందుకు వెళ్తున్నాయని చెప్పారు.
Sad Incident: చేతుల్లో నుంచి జారీ డ్రైనేజీలో పడ్డ 4 నెలల పసికందు.. బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు
టీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని.. గోడమీద పిల్లిలాగా ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. దొరల గడీలు బద్దలుకొట్టడానికి మీటింగ్ పెట్టిన బీసీ నేతలను తాను అభినందిస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఒక్క కేసీఆర్ మాత్రమేనన్నారు. అధికార పార్టీలో బీసీల పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి అయితే.. ప్రచార కమిటీ చైర్మన్ బీసీ అని.. కాంగ్రెస్ పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ ఉంటుందని వివరించారు. బలహీన వర్గాల వ్యక్తిని పార్టీ నుండి బయటకి గెంటేసినప్పుడు.. అధికార పార్టీ బీసీ నేతల ఆత్మ గౌరవం ఏమైంది? నిలదీశారు.
Pawan Kalyan Meets Amit Shah: ఢిల్లీలో పవన్ కల్యాణ్ మకాం.. అమిత్‌షాతో భేటీ
ఇదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దున్నపోతు కంటే ఏం తక్కువ ఉన్నావ్ అంటూ ధ్వజమెత్తారు. తప్పులు చేస్తూ తప్పించుకోవడానికి.. బీసీల ముసుగు కప్పుకొని ప్రయత్నం ఎందుకు? అని అడిగారు. 2014 నుండి 2023 వరకు బీసీలకు ఇచ్చిన బడ్జెట్ ఎంత? తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ఇచ్చిన బడ్జెట్ ఎంత? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు గౌడ్ ఎమ్మెల్సీలు ఉండేవారని, ఇప్పుడు ఎంతమంది గౌడ్స్ ఉన్నారో శ్రీనివాస్ గౌడ్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కి లేదని ఉద్ఘాటించారు.