NTV Telugu Site icon

Ponnam Prabhakar : ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలు సహకరించాలి..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ ,మేడిపల్లి సత్యం లతో కలిసి లోయర్ మానేర్‌ డ్యాం ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలు కూరు స్తున్నాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు. గత కొంత కాలంగా చెరువులు, కుంటలు నిండలేదని ఆందోళన పడుతున్న నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు , చెరువులు, కుంటలు నిండుతున్నాయని, మరో రెండు రోజులు పాటు వర్షాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కోహెడ – ముల్కనూరు ఇళ్ళంతకుంట మండలంలో తదితర ప్రాంతాల్లో రోడ్ల మీద నుండి వరద పోవడం వల్ల రవాణా అగిపోయిందని, ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో మొదలైంది.. ఎల్ఎండి లో 24 టీఎంసీ లకు ప్రస్తుతం 14 టిఎంసి ల ఉన్నాయని ఆయన తెలిపారు.

Bhatti Vikramarka : ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండండి

అంతేకాకుండా.. మిడ్ మానేరు కు మోయ తుమ్మెద వాగు , మూల వాగు నుండి వరద వస్తుందని, ఎల్లంపల్లి నుండి రోజువారీగా ఇప్పటికే నీటి విడుదల జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. మిడ్ మానేరు ,లోయర్ మానేరు , రంగ నాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు ప్రాజెక్ట్ లో నింపుకునే విధంగా వర్షాలు పడ్డాయని, అటు కిందికి కోదాడ వరకు నీళ్ళు అందించవచ్చని ఆయన వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని ఆయన కోరారు. రోడ్ల పై వరద వెళ్తుంటే ద్విచక్ర వాహనాలకు కూడా అనుమతి ఇవ్వకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. సిద్దిపేట – హనుమకొండ దారిలో కూడా వరద పోతుందని, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు.

IND vs AUS: మైండ్‌ గేమ్స్‌ మొదలు.. మెక్‌గ్రాత్ కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాడు: గవాస్కర్