NTV Telugu Site icon

Ponnam Prabhakar: ఆర్టీసి మనందరిది దానిని కాపాడుకోవాలి..

Ponnama Prabhakar

Ponnama Prabhakar

Ponnam Prabhakar: ఆర్టీసి మనందరిది దానిని కాపాడుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్ పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రజల సంస్థ ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు కొంతమంది కానిస్టేబుల్ లకి నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. గతంలో కరోనా, సమ్మె కారణంగా ఆర్టీసీ కి పలు సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. వాటన్నిటిని అదిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుందన్నారు. నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్నామన్నారు.

Read also: Venkatesh Netha: బీజేపీతో బీఆర్ఎస్ అంతర్గతం ఒప్పందం.. వెంకటేష్ నేత కీలక వ్యాఖ్యలు

ఇప్పటి వరకు పద్నాలుగున్నర కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. అక్యూపెన్సీ రేషియో బస్ స్టాండ్ లు ఖాళీగా ఉన్న పరిస్థితి నుండి బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో నూతన బస్సుల కొనుగోలు, నూతన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ సహకారంతో ఏండి మార్గదర్శకంలో ముందుకు పోతున్నామన్నారు. ప్రజలంతా సహకరించాలి.. దేశ వ్యాప్తంగా రైల్వే ఏ విధంగా ఉపయోగ పడుతుందో.. పేద ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు గమ్యానికి చేర్చే వ్యవస్థ రాష్ట్ర రవాణా లో ఆర్టీసీ పాత్ర కీలకమైందన్నారు. ఆర్టీసి మనందరిది దానిని కాపాడుకోవాలని సూచించారు. ఆర్టీసీ ని ముందుకు తీసుకుపోవడం లో అందరి సలహాలు కోరుతూ ఆర్టీసీ సంస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Harda Factory Blast : హరదా పేలుడులో పేరెంట్స్ ని కోల్పోయిన పిల్లల ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు

Show comments