NTV Telugu Site icon

Ponnam Prabhakar: రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను కేసీఆర్ బలి చేస్తున్నారు

Ponnam On Kcr

Ponnam On Kcr

Ponnam Prabhakar Fires On KCR Over Sriram Sagar Project: మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ పెట్టి తెలంగాణ అస్తిత్వం లేకుండా చేసిన కేసీఆర్.. ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీరు మహారాష్ట్రకు తోడుకొమ్మని కేసీఆర్ చెప్పడం.. తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. జీవనది లాంటి శ్రీరామ సాగర్‌ను మహారాష్ట్ర చేతికి ఇస్తే.. ప్రాజెక్టు పరివాహక ప్రాంతం స్మశానం అవుతుందన్నారు.

Babu Mohan: బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్ బూతుపురాణం

కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయని.. ఎస్ఆర్ఎస్‌పీ వరద కాలువ ప్రాజెక్టు వృధా అవుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే సాగునీటి కోసమని.. ఇప్పుడు తెలంగాణ హక్కుగా ఉన్న ప్రాజెక్టును మహారాష్ట్రకు అప్పగిస్తానంటే, కేసీఆర్‌ను ప్రజలు ఛీ కొడతారంటూ పొన్న ప్రభాకర్ మండిపడ్డారు. గోదావరిపై మహారాష్ట్ర కడుతున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టుల గురించి మనం ఎన్నో ఉద్యమాలు చేశామని.. ఇప్పుడు ఆ నీళ్లను వాళ్ళు తోడుకుంటే చూస్తూ ఊరికే ఉందామా? అని ప్రశ్నించారు. బాబ్లీ మీద పోరాటం చేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని.. ఈ విషయంపై వాళ్లేమంటారని నిలదీశారు. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకపోతే రైతు ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు.

Hyderabad Crime: రౌడీషీటర్ దారుణ హత్య.. కారణం అదేనా?

అంతకుముందు.. కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసినప్పుడు పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా రెండు రోజుల ముందుగానే కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారని, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని ఫైర్ అయ్యారు. ఇటువంటి నిరసనలు ఎదుర్కోవద్దు అనుకుంటే, హుజరాబాద్ ఉప ఎన్నికల్లో వేలకోట్ల హామీలను అమలు చేయండని అడిగారు. కుల సంఘాలు, గ్రామాలు, రోడ్లు, ఇతర ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.