Site icon NTV Telugu

Ponnam Prabhakar: బలహీన వర్గాలు ఆలోచించండి .. ఎన్నికల్లో కాంగ్రెస్ కి అండగా నిలబడండి..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: బలహీన వర్గాలు ఆలోచించండి … ఎన్నికల్లో కాంగ్రెస్ కి అండగా నిలబడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ బలహీన వర్గాల వ్యతిరేకి..వారి మేనిఫెస్టోలోని 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ లో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు చేర్చామన్నారు. బలహీన వర్గాలు ఆలోచించండి … ఎన్నికల్లో కాంగ్రెస్ కి అండగా నిలబడాలని పిలుపు నిచ్చారు. బీజేపీ లోక్ సభ ఎన్నికలకు కోసం 14 అంశాలతో మేనిఫెస్టో ని ప్రకటించిందని అన్నారు. బలహీన వర్గాల ప్రధాన మంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయమన్నారు. ఇది దేశంలో ఉన్నా బలహీన వర్గాలంతా గమనించాలని కోరుతున్న అన్నారు.

Read also: Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..

దాంతో పాటుగా 10 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదన్నారు. కాని బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కాని ..లబ్ది కాని జరిగే నిర్ణయం తీసుకొనటువంటి ప్రధాని పట్ల దయచేసి బలహీన వర్గాలు ఆలోచన చేయాలన్నారు. కుల గణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటె ..దానికి సంబంధించి పాంచ్ న్యాయ్ లోపల ఒక అంశంగా పెట్టిందన్నారు. గతంలోనే ఆ అంశాలను వ్యతిరేకించే వ్యాపార వర్గాల భారతీయ జనతా పార్టీ సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చి కుల గణన కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. దయచేసి ఆలోచన చేయండి.. ఎంత బీసీ లు ,ఎస్సీలు , ఎస్టీలు , మైనార్టీలు ,ఎంత ధనిక వర్గాకు ఉన్నారో తెలిస్తే వాళ్ళకి అంత న్యాయం చెయవచ్చని సమాజిక స్పృహ తో కాంగ్రెస్ పార్టీ ఉంటే అన్నారు.

Read also: Israel-Iran Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత కారణంగా చమురు సంక్షోభం మొదలవుతుందా?

పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో ని..కాంగ్రెస్ మేనిఫెస్టో ని బీసీ లు చదివి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ బలహీన వర్గాల శాఖ మంత్రిగా కోరుతున్న అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కుల గణన సర్వే చేస్తుంది ..అనేక కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భవిష్యత్ లో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా మీ బిడ్డ మీ పక్షానా నిల్చుంటాడన్నారు. ఎన్నికల్లో బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని బీజేపీ మేనిఫెస్టో ని చదివి..వారి బలహీన వర్గాల పట్ల ఉన్న వ్యతిరేకత ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలని కోరుతున్నా అని తెలిపారు.
K. Laxman: హైదరాబాద్ లో నేడు, రేపు బీజేపీ సంపర్క్‌ కార్యక్రమం

Exit mobile version