Ponguleti Sudhakar Reddy Comments On Telangana Decade Celebrations: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సాగునీటి దినోత్సవాలపై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 8 తర్వాత 9 మిస్ చేసి.. దశాబ్ది వేడుకలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి.. రుణ మాఫీ చేయలేదని ఆరోపణలు చేశారు. ప్రజలను భ్రమలో పెట్టే కార్యక్రమమే ఈ నీళ్ళ పండుగ అని విమర్శించారు. అసలు ఈ సెలెబ్రేషన్స్ చేసుకునే అర్హత మీకుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Samantha: ద్రౌపది ముర్మును కలిసిన ‘సిటాడెల్’ టీమ్ .. ఫోటో వైరల్
ఇరిగేషన్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం 155 వేల 210 కోట్ల 86 లక్షలు ఖర్చు చేశారని.. కానీ ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించారనేది వారికే క్లారిటీ లేదని పొంగులేటి సుధాకర్ పేర్కొన్నారు. ఇరిగేషన్ లెక్కలన్ని తప్పుడుగా ఉన్నాయని, దీని వెనుకున్న మతలబు ఏంటని అడిగారు. ఎన్ని ఏకరాలకు కొత్తగా నీళ్లు అందించారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 84% బోర్ల ద్వారా నీటి పారుదల కొనసాగుతోందన్న ఆయన.. రాష్ట్రం ఏర్పడినప్పుడు 18 లక్షల బోర్లు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 26 లక్షలకు చేరిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల ద్వారా నీళ్లు ఇస్తే, బోర్ల సంఖ్య ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. కాళేశ్వరం గొప్పగా కట్టామని గప్పలు చెప్తున్న బీఆర్ఎస్ నేతలు.. మరి అక్కడెందుకు ఈ దశాబ్ది ఉత్సవాల సెలబ్రేషన్స్ చేయట్లేదని నిలదీశారు. కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ పారుతున్నయో చెప్పాలని డిమాండ్ చేశారు.
Afghanistan: ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి
అక్కరకు వచ్చే ప్రాణహితను పక్కన పెట్టి.. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని పొంగులేటి సుధాకర్ ఆరోపణలు చేశారు. పక్క రాష్ట్రం వారు సంగమేశ్వర ప్రాజెక్ట్‌తో నీళ్ళ దోపిడీ జరిపితే.. చీమ కుట్టినట్లు కూడా కేసిఆర్ స్పందించలేదని మండిపడ్డారు. తుమ్మిడిహాట్టి ప్రాజెక్ట్ ఎక్కడికి పోయిందని అడిగారు. కేసిఆర్ చేతగానితనం వల్లే.. మనకు న్యాయంగా రావాల్సిన వాటా రాకుండా పోయిందన్నారు. కృష్ణా నది నుంచి రాయలసీమకు నీళ్ళు తరలిపోతుంటే.. కేసీఆర్ ఎందుకు నోరు విప్పలేదని నిలదీశారు. ఇరిగేషన్‌లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన.. దమ్ముంటే ప్రాజెక్ట్‌లపై చేసిన ఖర్చు మీద బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. బీజేపిని బూచిగా కాంగ్రెస్, బీఅర్‌ఎస్ అడే నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తేల్చి చెప్పారు.