NTV Telugu Site icon

Ponguleti Srinivasa Reddy: కరెంట్ ఒక్క నిమిషం కూడా ఎక్కడా పోలేదు..

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivasa Reddy: కరెంట్ ఒక్క నిమిషం కూడా ఎక్కడా పోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందన్నారు. రాముల వారిని సైతం రాజకీయాల్లోకి తెచ్చింది బీజేపీ అని తెలిపారు. తలంబ్రాల పేరుతో మరో సారి అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటుందన్నారు. 400 సీట్లు బీజేపీకి ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చితే రిజర్వేషన్ లను ఎత్తివేస్తుంది బీజేపీ అన్నారు.

Read also: Namburu Sankara Rao: వైసీపీలోకి భారీగా చేరికలు.. పార్టీలోకి ఆహ్వానించిన నంబూరు..

నోరు తెరిస్తే పచ్చి అబద్దం చెప్తారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ప్రజలను ప్రలోభ పెట్టీ ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చుతున్నారన్నారు. లక్షన్నర కోట్ల దోచారు కేసీఆర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. సిగ్గులేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర వుందన్నారు. కృష్ణా నీళ్లను ఆంధ్రకు ఇచ్చింది నిజమా కాదా? అని ప్రశ్నించారు. కరెంట్ ఒక్క నిమిషం కూడా ఎక్కడా పోలేదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ వుండదని కీలక వ్యాఖ్యలు చేశారు.
Petrol Price : ఒక నెలలో 10శాతం పడిపోయిన క్రూడాయిల్ ధర.. మరి పెట్రోల్ ధరల పరిస్థితి

Show comments