Political War in Pinapaka: భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గాల మధ్య వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాటు మరికొన్ని ఘటనలలో పొంగులేటి రేగా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. గతంలో రెండు వర్గాలు కొట్టుకున్నారు కూడా. ఈరోజు కూడా అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామంలో వరద బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం పేర్ల నమోదులో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. చిలికి చిలికి గాలి వాన మాదిరిగా ఒకరిపై ఒకరు దాడులు చేస్తుకున్నారు.
Minister Harish Rao: అందరూ నన్ను తిడతారు.. ఎందుకో తెలుసా!
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలని చెదరగొట్టారు. ఈరోజు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రాద్రి, భద్రాచలం పినపాక నియోజకవర్గం నిత్యవసర వస్తువులను పది వేల మందికి సహాయం చేసే పంపిణీ కార్యక్రమం ఒకవైపు కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం పేర్ల నమోదులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది .అనర్హులకి అర్హత లేని వారి పేర్లు నమోదు చేస్తున్నారని ఇరు వర్గాల మధ్య వివాదం సాగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తోపులాటలు జరిగాయి. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలని అక్కడ నుంచి పంపించివేశారు.