NTV Telugu Site icon

TS Assembly: మొండి బకాయిల్లో సిద్ధిపేట, గజ్వేల్లే టాప్: సీఎం

Revanth Reddy Vs Akabbarudd

Revanth Reddy Vs Akabbarudd

ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో విద్యుత్‌పై వాడివేడిగా చర్చ జరుగుతుంది. అధికార పార్టీ, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కరెంట్ మొండి బకాయిల అంశాన్ని లేవనెత్తారు. ఈ మేరకు సభలో సీఎం మాట్లాడుతూ.. మొండి బకాయిల్లో హరీష్ రావు నియోజకవర్గం సిద్ధిపేట, మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వెల్, అలాగే సౌత్ హైదరాబాద్‌లే టాప్‌లో ఉన్నాయని విమర్శించారు. ఇన్ని విషయాలు మాట్లాడుతున్న అక్బర్ తమ ప్రాంతంలో ఉన్న విద్యుత్ బాకాయిలు చెల్లించే బాధ్యత వహిస్తామని ఎందుకు చెప్పడం లేదన్నారు. తమ అధికారంలో కరెంట్ కోసం అసలు ఆందోళనలనే జరగలేదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటున్నారని, కామారెడ్డిలో రైతులు కరెంట్ కోసం ఆందోళన చేయాలేదా? అని ప్రశ్నించారు. కామారెడ్డి కేసీఆర్‌ది.. నాకేం సంబంధం అంటారేమో.. సూర్యాపేట జిల్లాలో కుడా రైతులు ఆందోళన చేశారని గుర్తు చేశారు.

అక్బరుద్దీన్‌కు సీఎం కౌంటర్
అనంతరం అక్బరుద్దీన్‌ను ఉద్దేశిస్తూ సీఎం మాట్లాడారు. అన్ని విషయాలు సభ ముందు పెడితే అక్బరుద్దీన్ ని అభినందిస్తామన్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్ అయ్యి 9 మంది చనిపోయారని, అందులో చనిపోయిన ఫాతిమా అనే అమ్మాయి కూడా ఉంది. ఆమె కుటుంబాన్ని మేము ఆదుకున్నామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది. అసలు ఆ మైనార్టీ కుటుంబాన్ని కేసీఆర్ కానీ.. జగదీష్ రెడ్డి కానీ కనీసం పట్టించుకోనే లేదు. మరి దీనిపై అప్పుడు ఎంఐఎం ఎందుకు మాట్లాడలేదు. ఆ ఘటన మీద MIM ప్రస్తావిస్తే అభినందించే వాళ్ళమని సీఎం అన్నారు. Mim.. కేసీఆర్‌ని పదే పదే రక్షించే పని ఎందుకు చేస్తోందని పేర్కొన్నారు. మైనార్టీల హక్కులను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుందన్నారు. మైనార్టీలను సీఎం లను.. రాష్ట్రపతి ని చేసింది కాంగ్రెస్ అని.. మీరేం చేశారు? అని ప్రశ్నించారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది మేమే.. మీ మిత్రుడు కేసీఆర్ 12 శాతం ఇస్తా అని ఇవ్వనేలేదు అని ఎద్దేవా చేశారు. ఎంఐఎం.. కేసీఆర్‌కి మిత్రుడు కావచ్చు.. మోడీ కి మద్దతు ఇవ్వచ్చు.. వాళ్ళ ఇష్టం.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలను పీసీసీ ని..హోంమంత్రి ని చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేటీఆర్‌, అక్బర్‌కు స్పీకర్ సూచన
అయితే సీఎం మాట్లాడుతుండగా మధ్యలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కల్పించుకోవడంతో స్పీకర్ కలుగజేసుకుని ఆయనను వారించారు. సీఎం మాట్లాడుతుండగా డిస్ట్రబ్ చేయొద్దని కేటీఆర్‌కు సూచించారు. మీరు సీనియర్ సభ్యులు.. గజ్వెల్ డివిజన్ లో..41 శాతం.. హైదరాబాద్ సౌత్ లో 61 శాతం బకాయిలు ఉన్నాయని సీఎం అంటున్నారు. మీరు ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుంది అని కేటీఆర్‌ను ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యానించారు. అనంతరం స్పీకర్ అక్బరుద్దీన్‌ను ఉద్దేశిస్తూ.. అక్బర్ మీరు సీనియర్.. చైర్ వైపు చూసి మాట్లాడండి అనగా.. ఆయన మాట్లాడుతూ.. సీఎం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

సీఎంది సిల్లి వాదన
మైనార్టీ ని జూబ్లీహిల్స్ లో ఓడించారు అంటున్నారు సీఎం. ఇది సిల్లి వాదనా. జూబ్లీహిల్స్ లో 2014 లో నవీన్ యాదవ్ ని పెట్టింది MIM. 2018 లో నవీన్ యాదవ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 2023 లో అజారుద్దీన్ ని మేము నిలబెడితే.. mim అభ్యర్థిని పెట్టింది. వాస్తవానికి సీఎం గారు ఎబీవీపీ వింగ్ బీజేపీ నుంచి ప్రయాణం మొదలు పెట్టి.. ఆ తర్వాత టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్‌తో కలిసి పని చేశారు’ అక్బరుద్దీన్ అన్నారు. అక్బరుద్దీన్ కామెంట్స్‌కి సీఎం ఘాటుగా స్పందించారు. నాదెండ్ల తో mim దోస్తీ చేసింది.. Ntr తో దోస్తీ.. చంద్రబాబు తో దోస్తీ.. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లతో దోస్తీ చేస్తుందన్నందంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యాలను తిప్పికొట్టారు సీఎం రేవంత్. అలాగే కేసీఆర్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడో కూడా చర్చ చేద్దామని, ఎవరెవరు ఎక్కడ నుండి వచ్చారో చర్చ చేద్దామంటే.. రోజు చర్చ పెడదామంటూ సవాలు విసిరారు సీఎం.

Show comments