NTV Telugu Site icon

Warangal Traffic: వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. సిటీ బయటే భారీ వాహనాలు..

Waranagal Trafic

Waranagal Trafic

Warangal Traffic: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో హన్మకొండకు వెళ్లనున్నారు. హన్మకొండలో రూ.900 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ సభలను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు అధికారులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు నగరానికి విచ్చేస్తున్న మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో వరంగల్‌, హనుమకొండ, కాజీపేట పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏ.వి రంగనాథ్‌ తెలిపారు. ఈ ఆంక్షలు శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు.

వాహనాలకు ట్రాఫిక్‌ ఆంక్షలు..

● ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుంచి కేయూసీ, సీపీఓ, అంబేడ్కర్‌ సెంటర్‌, ఏషియన్‌ శ్రీదేవిమాల్‌ మీదుగా బస్టాండ్‌ చేరుకోవాలి.

● హనుమకొండ బస్టాండ్‌ నుంచి బయలుదేరి ము లుగు, కరీంనగర్‌ వైపునకు వెళ్లే బస్సులు వయా ఏషియన్‌ శ్రీదేవి మాల్‌, అంబేడ్కర్‌ సెంటర్‌, సీపీఓ ద్వారా కాకతీయ యూనివర్సిటీ జంక్షన్‌ మీదుగా వెళ్లాలి.

● హనుమకొండ బస్టాండ్‌ నుంచి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపునకు వెళ్లాల్సిన బస్సులు వయా బాలసముద్రం, ఆదాలత్‌, హంటర్‌రోడ్డు మీదుగా వెళ్లాలి.

● వరంగల్‌ బస్టాండ్‌ నుంచి హనుమకొండ వైపు వచ్చే బస్సులు చింతల్‌ బ్రిడ్జి నుంచి రంగశాయిపేట మీదుగా నాయిడు పెట్రోల్‌ పంప్‌ సెంటర్‌, ఉర్సుగుట్ట, ఆదాలత్‌, బాలసముద్రం రోడ్డు మీదుగా హనుమకొండకు చేరుకోవాలి.

భారీ వాహనాలు ఇలా..

ములుగు, భూపాలపల్లి వైపు నుంచి హైదరాబాద్‌ చేరుకోవాల్సిన భారీ వాహనాలు ఆరెపల్లి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి వెళ్లాలి. భూపాలపల్లి, పరకాల నుంచి ఖమ్మం చేరుకోవాల్సిన వాహనాలు ఆరెపల్లి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్‌ పంపు నుంచి వెళ్లాలి.

● భూపాలపల్లి, పరకాల నుంచి నర్సంపేట వైపు వెళ్లాల్సిన వాహనాలు కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్‌పిరీలు, గొర్రెకుంట మీదుగా వెళ్లాలి.

● భారీ వాహనాలు సిటీ బయటే నిలిపివేయాలి. మంత్రి పర్యటన ముగిసే వరకూ భారీ వాహనాలకు సిటీలోకి అనుమతి లేదు.
Mumbai : ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..