అత్త ఇంటికి కన్నం వేసిన అల్లుడిని పట్టుకున్నారు పోలీసులు. దీని పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసు 24 గంటల్లో ఛేదించాము. 12 లక్షల నగదు తో పాటు, 1.5 కేజీ గోల్డ్.. మొత్తం విలువ 65 లక్షల విలువ అయిన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. జోగిని రంగమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఇంట్లో వరుసకు అల్లుడు లక్ష్మన్ చోరీ చేసినట్టు ఫిర్యాదు చేసింది. లక్ష్మణ్ అనే వ్యక్తి పై మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు లక్ష్మణ్ నుంచి మొత్తం నగదు రికవరీ చేసాం.లక్ష్మణ్ జోగిని రంగమ్మ కి బంధువు అల్లుడు అవుతాడు.. వరుస కి అత్త అవుతుంది.నవంబర్ చివరి వారంలో కాశీకి వెళ్ళింది.. వచ్చే సరికి చోరి జరిగినట్టు గుర్తించి.. ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగ్గిన పోలీసులు లక్ష్మణ్ దొంగతమ్ చేసినట్లు గుర్తించారు.
అత్త ఇంటికి కన్నం వేసిన అల్లుడు… పట్టుకున్న పోలీసులు
