NTV Telugu Site icon

Huge Amount Seized: లోక్​సభ ఎన్నికల ఎఫెక్ట్‌.. హైదరాబాద్ లో రూ.40 లక్షలు సీజ్‌..!

Huge Amount Seized

Huge Amount Seized

Huge Amount Seized: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఇవి ఎన్నిక కోడ్ నిబంధనలు. లేకుంటే నగదు స్వాధీనం చేసుకుంటారు. బంగారు, వెండి ఆభరణాలకు కూడా సరైన ఆధారాలు చూపాలి. మద్యం రవాణాపై ఆంక్షలు ఉంటాయి. అయితే ఇవి ఎన్నికల కోడ్ నిబంధనలు.. దీంతో.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ సోదాలు నిర్వహించి అక్రమ నగదు తరలింపును అడ్డుకుంటున్నారు. తాజాగా ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీగా నగదు సీజ్ చేస్తున్నారు. సరైన పత్రాలు లేని రూ.40 లక్షల డబ్బును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు.

Read also: Puspa 2 Srivalli: పుష్ప గాడి పెళ్ళాం అంటే ఆ మాత్రం ఉండాల..!

అబిడ్స్ పీఎస్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ దగ్గర కారులో తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి రూ. 40 లక్షల క్యాష్, ఒక కార్ ని సీజ్ చేశారు. డబ్బుకు సంబందించిన సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కారును, రూ.40 లక్షల డబ్బును సీజ్ చేశారు. కాగా.. రూ.10 లక్షల కంటే ఎక్కువ డ్రా చేస్తే వారి సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. అయితే ఎన్నికల అనంతరం పోలీసులు, వివిధ శాఖల అధికారులు జరిపిన తనిఖీల్లో దొరికిన సొమ్మును క్లియర్ చేసేందుకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. సరైన రుజువు చూపితే డబ్బు యజమానికి తిరిగి వస్తుందని తెలిపారు.
Viral Video: ఇదేంది భయ్యా.. చిప్స్ ప్యాకెట్స్ అంటే ఇష్టమని.. మరి ఇంతలా కార్ డెకరేషనా..?!