Huge Amount Seized: లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. హైదరాబాద్ లో రూ.40 లక్షలు సీజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Amount Seized: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఇవి ఎన్నిక కోడ్ నిబంధనలు. లేకుంటే నగదు స్వాధీనం చేసుకుంటారు. బంగారు, వెండి ఆభరణాలకు కూడా సరైన ఆధారాలు చూపాలి. మద్యం రవాణాపై ఆంక్షలు ఉంటాయి. అయితే ఇవి ఎన్నికల కోడ్ నిబంధనలు.. దీంతో.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ సోదాలు నిర్వహించి అక్రమ నగదు తరలింపును అడ్డుకుంటున్నారు. తాజాగా ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీగా నగదు సీజ్ చేస్తున్నారు. సరైన పత్రాలు లేని రూ.40 లక్షల డబ్బును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు.
Read also: Puspa 2 Srivalli: పుష్ప గాడి పెళ్ళాం అంటే ఆ మాత్రం ఉండాల..!
Also Read
- TG20 తొలి ఛాంపియన్‌గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
అబిడ్స్ పీఎస్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ దగ్గర కారులో తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి రూ. 40 లక్షల క్యాష్, ఒక కార్ ని సీజ్ చేశారు. డబ్బుకు సంబందించిన సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కారును, రూ.40 లక్షల డబ్బును సీజ్ చేశారు. కాగా.. రూ.10 లక్షల కంటే ఎక్కువ డ్రా చేస్తే వారి సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. అయితే ఎన్నికల అనంతరం పోలీసులు, వివిధ శాఖల అధికారులు జరిపిన తనిఖీల్లో దొరికిన సొమ్మును క్లియర్ చేసేందుకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. సరైన రుజువు చూపితే డబ్బు యజమానికి తిరిగి వస్తుందని తెలిపారు.
Viral Video: ఇదేంది భయ్యా.. చిప్స్ ప్యాకెట్స్ అంటే ఇష్టమని.. మరి ఇంతలా కార్ డెకరేషనా..?!
తాజావార్తలు
-
Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Slum Dog Release : పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!