గోశామహాల్‌లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. హోంమంత్రి మహమ్మద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్, మాజీ ఉన్నాతాధికారులు హాజరయ్యారు. హోంమంత్రి, డీజీపీ మహేందర్‌రెడ్డి, TSSP అభిలాష్‌బిస్తా, సీపీ అంజనీకుమార్‌పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..1959 భారత్, చైనా సరిహద్దుల్లో దేశభద్రతలో ప్రాణాలు త్యాగం చేసిన వారికి గుర్తుగా అక్టోబర్21 ని పోలీసు అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
పోలీసులు నేరాలు చేధించడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15లక్షల సీసీ కెమెరాల అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో8.25 సీసీ కెమెరాలు ఉండగా, హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ పరిధిలో దాదాపు7లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలీసుల సంక్షేమమే ముందుకు వెళ్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు.