NTV Telugu Site icon

Allu Arjun: చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద పోలీసుల ఆంక్షలు..

Allu Arjun

Allu Arjun

Allu Arjun: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ జరిగిన ఘటనపై హీరో అల్లు అర్జున్ 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందుకు విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు ఏసీపీ ముందు అల్లు అర్జున్ విచారణకు హాజరుకానున్నారు. అల్లు అర్జున్‌ను దర్యాప్తు అధికారి ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించనున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు విధించారు. వాహనాలు రాకపోకలతో పాటు ఇతరుల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఏసీపి రమేశ్ కుమార్ మీడియాను హెచ్చరికలు జారీ చేశారు.

Read also: AlluArjun : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు.

పోలీస్‌ స్టేషన్‌కు 200 మీటర్ల దూరం నుండి ఆంక్షలు విధించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు డీసీపీ చేరుకున్నారు. అక్కడి పరిస్థితులపై ఆరాతీశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ఎవరూ కూడా పోలీసుల వద్దకు రాకుండా ముందస్తు ఏర్పట్లు చేయాలని తెలిపారు. 200మీటర్ల పరిధిలో ఆంక్షలు వుండాలని, వాహనాలు కూడా అనుమతించకూదని తెలిపారు. ఉదయం 11 గంటలలోపు అల్లు అర్జున్‌ రానున్న నేపథ్యంలో పోలీస్టేషన్ల పరిధిలో ఎవరిని అనుమతించకూడదని తెలిపారు. అల్లు అభిమానులు కూడా భారీ రానున్న నేపథ్యంలో ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

Show comments