NTV Telugu Site icon

వరదలో చిక్కుకున్న యువకులను కాపాడిన పోలీసులు…

మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమటిచేను సల్పలా వాగు ప్రాజెక్ట్ మత్తడి వద్ద గురువాపూర్ కి చెందిన శ్రీనివాస్ శ్రావణ్, ప్రసాదులు చేపలు పట్టడానికి వెళ్లి వరద నీరు ఎక్కవ కావడం తో బయటకు వెళ్ళడానికి వెళ్లలేక ప్రాణ భయంతో చుట్టూ నీరు మధ్యలో ఒక మట్టి కుప్ప లాగా ఉన్న ప్రాంతం లో చిక్కుకొని నీటిలో ముగ్గురు యువకులు ఉన్నారు . సమాచారం మేరకు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎస్ఐ విజేందర్, మందమర్రి ఎస్ఐ భూమెష్ లు సింగరేణి రెస్క్యూ టీం , స్థానిక గజఈతగాళ్ళ సాయంతో వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది. పోలీసులకు సమాచారం అందిన వెంటనే స్పందించి రెస్క్యూ టీం తో కలిసి ముగ్గురి ప్రాణాలు కాపాడడం జరిగింది. లేకపోయింటే భారీ వర్షాల కారణంగా రాత్రి నీటి ప్రవాహం ఎక్కువై వాళ్లు నీటిలో కొట్టుకు పోవడం జరిగి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. సకాలంలో స్పందించిన పోలీసుల తీరు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.స్థానిక ప్రజలు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.