NTV Telugu Site icon

కోడిపందెం రాయుళ్లను పరిగెత్తించిన పోలీసులు

మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ మరియు జైపూర్ మండలంలో కోడిపందాలు, పేకాట యథేచ్ఛగా నడుస్తుంది. పక్క సమాచారంతో జిల్లా పోలీసులు వారిని పరుగెత్తించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగపూర్ గ్రామ శివారులో కోడిపందెం స్థావరంపై పొలీసులు దాడి చేశారు. ఈ ఆకస్మిక దాడిలో ముగ్గురు అరెస్ట్ కాగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 3, 500 నగదు, రెండు పందెం కోళ్లు, 11 కోళ్లకు కట్టే కత్తులు, రెండు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు.