ప్రజల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు వడ్డీ వ్యాపారులు.. అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ.. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తున్నారు.. ఇక, మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు అధికారులు. మహబూబాబాద్, గార్ల, డోర్నకల్, కేసముద్రం మండలాల పరిధిలో చిట్టీ వ్యాపారులు, చిట్ ఫండ్స్ ఆగడాలు శృతి మించాయి. దీంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ నేతృత్వంలో పోలీసులు 22 బృందాలుగా విడిపోయి దాడులు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారుల కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. అనేకమంది అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలోనూ వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడులు చేశారు. దాంతో కొంతకాలం సైలెంట్ అయిన వ్యాపారులు.. మళ్లీ యాక్టివ్ అయి కొత్త పద్ధతుల్లో వ్యాపారం చేస్తున్న విషయం దృష్టికి రావడంతో.. పోలీసులు రెయిడ్స్ చేశారు.
Read Also: RTC Protest: ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ కార్మికుల ఆందోళన..
