Fake Currency: హైదరాబాద్ పాతబస్తీలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. పాతబస్తీ అడ్డాగా నకిలీ కరెన్సీ దందా కొనసాగిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు హైదారబాద్ పోలీసులు. స్థానిక సమచారం మేరకు పాతబస్తీకి చేరుకున్న పోలీసులు షాక్ కు గురయ్యారు. పాతబస్తీలో దాడులు నిర్వహించిన సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
Read also: RSS Rally: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
పాతబస్తీలో నకిలీ నోట్ల దందా సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో అలర్ట్ అయిన పోలీసులు ఈ విషయంపై నిఘా ఉంచారు. నకిలీ నోట్లు మారుస్తున్నారని తెలుసుకుని ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. కాగా..ఈ దాడుల్లో రూ. 30 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను ముద్రించేందుకు ఉపయోగించే ప్రింటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘాతుకానికి పాల్పడిన సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం. కాగా.. నిందితులు గత కొంతకాలంగా ఈ దందా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు నకిలీ కరెన్సీ ముఠాకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ కరెన్సీ ఎలా సరఫరా అవుతుంది? తయారీ తర్వాత ఎక్కడికి సరఫరా చేస్తున్నారు? ఈ ముఠా వెనుక ఇంకెవరైనా ఉన్నారా? పోలీసులు విచారిస్తున్నారు. ఈ ముఠా చాలా కాలంగా గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
EX MLA Nandiswar Goud: మహిపాల్ రెడ్డి పాపాల రెడ్డిగా మారారు