Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అవరణ లో ఉన్న దర్గాలో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా దర్గాలో పూజలు చేసేందుకు రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. మేమే ముందునుంచి దర్గాను మెయింటైన్ చేస్తున్నామని, కొందరు మధ్యలో వచ్చి దర్గా అధికారాలు ఇవ్వాలని గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనాది నుండి దర్గాపై తమకే హక్కులు ఉన్నాయని ఒక వర్గం, తాతల నాటి నుండి హక్కులు తమకే ఉన్నాయని మరో వర్గం ఇలా కొంత కాలంగా గొడవ జరగడం మళ్లీ సర్దుమనగడం వంటివి జరుగుతూ వస్తుంది. అయితే ఇవాళ ఆ చిన్న గొడవ పెద్దదైంది. ఇరు వర్గాలు దర్గావద్ద గొడవకు దిగారు. రాజన్న ఆలయం వద్దనే దర్గాలో గొడవ జరగడం భక్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దర్గాకు, ఆలయానికి వచ్చే వారు అందరూ షాక్ తో చూస్తుండి పోయారు. దర్గా మెయింటైన్ పై గొడవలు ఏంటిని ఆశ్చర్యపోయారు. దర్గాపై హక్కులు మావంటే మాదని తోపులాట చోటుచేసుకోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Jawan Movie Review: జవాన్ రివ్యూ..
హుటాహిటిన పోలీసులు రాజన్న ఆలయం వద్ద ఉన్న దర్గా దగ్గరకు వచ్చారు. ఇరు వర్గాలను శాంతింప చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ఓ నిర్ణయం తీసుకున్నారు. గొడవలకు తావులేకుండా దర్గాలో ఎవరు పూజలు చేయాలన్న దానిపై నిర్ణయం వచ్చేంత వరకు ఇరు వర్గాలు లోపలికి ప్రవేశించరాదని తేల్చి చెప్పారు. ఇరు వర్గాలను బయటకు పంపి దర్గాకు తాళం వేశారు. దర్గాపై ఎవరికి హక్కులుంటే వారు సరైన ఆధారాలతో పాటు పత్రాలతో రావాలని పోలీసులు ఇరు వర్గాలను ఆదేశించి దర్గాకు తాళం వేసి, బయట పంపించడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. మరొ కొందరు మస్లీం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్గాలో పూజలు నిర్వహించకుండా తాళం వేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి దీనిపై అధికారులు, గొడవకు దారితీసిన ఆ రెండు వర్గాలు ఏం నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాల్సిందే.
Udayanidhi Stalin: ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ.10 లక్షల రివార్డ్.. ఏపీలో పోస్టర్లు..