NTV Telugu Site icon

Adilabad: పోలీసు జాగిలం పదవీ విరమణ.. ఎమోషనల్‌ అయిన అధికారులు

Adilabad

Adilabad

Adilabad: నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు వెతకడం, పోలీసులకు క్లూస్ అందించడం.. ఇదీ జాగిలం తార పని. కానీ, ఈ పనులు చేయడానికి వాటికి చాలా శిక్షణ ఇవ్వాలి. హత్య, దొంగతనం, పేలుడు పదార్థాలు, డ్రగ్స్‌ను గుర్తించడం వంటి నేరాలను ఛేదించేందుకు పోలీసులకు ఉన్న ఆయుధం ఈ జాగీలే. అయితే నేడు పోలీసు జాగిలం తార పదవి విరమణ సందర్భంగా.. పోలీసు అధికారులు ఎమోషనల్ అయిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Prof. Kodandaram: పోలవరం పూర్తి అయితే.. భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుంది..!

నిర్విరామంగా శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో పోలీసు జాగిలాలు ఉన్నతమైన సేవలను అందిస్తాయని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీసు జాగిలం తార పదవీ విరమణ కార్యక్రమంలో జాగిలం సేవలను కొనియాడారు. శాలువా పూలమాలలతో సత్కరించారు. పోలీసు జాగిలం తార 2013-01-22లో పుట్టి, 2013 సంవత్సరంలో ఐఐటిఎ మొయినాబాద్ నందు ఎల్ సోమన్న హండ్లర్ కు అందజేసి సంవత్సరం పాటు పేలుడు పదార్థాలను కనుగొనడంలో శిక్షణను తీసుకుని ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేయడం జరిగిందన్నారు.

Read also: Prabhas : సీతారామం దర్శకుడితో ప్రభాస్ మూవీ..ఫోటో షూట్ ప్లాన్..

అప్పటినుండి 12 సంల పాటు నిర్విరామంగా మందు గుండు సామాగ్రి అయిన గన్ పౌడర్, ఆర్డీఎక్స్, సేఫ్టీ ఫీజు, టిఎన్టి, పీఇకే, కార్డెక్స్ లాంటి పేలుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. జాగిలం తార వల్ల పోలీసు వ్యవస్థకు ఉన్నతమైన సేవలను అందించిందని అన్నారు. పోలీసు జాగిలం తారతో హాండ్లర్ ఎల్ సోమన్న జాగిలంతో పాటు విధులను నిర్వర్తించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా వీఐపీ బందోబస్తుల సమయంలో ముఖ్యమైన వ్యక్తులు కూర్చుండి ఉండే స్టేజి, పబ్లిక్ గ్యాలరీ లలో, రోడ్డు భద్రతా విషయంలో రోడ్డుపై, కల్వర్టుల నందు మందు గుండు, పేలుడు పదార్థాలను కనుగొనడంలో విధులను నిర్వర్తించడం జరిగిందని అన్నారే. శేష జీవితం ఎటువంటి విధులను నిర్వర్తించకుండా పూర్తిగా విరామం ను అందజేయాలని ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారుల బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Kalki 2898 AD: ఇద్దరు హీరోల ఆశలు అడియాశలే!!!