Site icon NTV Telugu

మంచిరేవుల ఫాంహౌస్ పేకాట కేసులో కొనసాగుతున్న దర్యాప్తు…

మంచిరేవుల ఫామ్‌హౌస్ పేకాట కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధాన నిందితుడు సుమన్‌ ను 2 రోజుల కస్టడీకి అప్పగించింది ఉప్పరపల్లి కోర్టు. నేడు, రేపు గుత్తా సుమన్‌ ను ప్రశ్నించనున్నారు నార్సింగి పోలీసులు. అయితే ఇవాళ పోలీస్ స్టేషన్‌ కు నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ రానున్నారు. ఆ ఫాంహౌస్ రెంటల్ అగ్రిమెంట్లు తేవాలని రవీంద్రకు సూచించారు పోలీసులు. రెంటల్ అగ్రిమెంట్ల ఆధారంగా రవీంద్రను ప్రశ్నించనున్నారు పోలీసులు. అయితే గుత్తా సుమన్‌ పై ఏపీలో ఉన్న కేసులపై ఆరా తీస్తున్నారు నార్సింగి పోలీసులు. ఇప్పటికే సుమన్‌ పై కేసు వివరాలు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. బ్లాక్ మెయిల్, ఫోర్జరీ, చీటింగ్ కేసులు అతని పై ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

Exit mobile version