NTV Telugu Site icon

సరదాలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు : పోలీస్ కమిషనర్

CP Anjani Kumar

CP Anjani Kumar

హైదరాబాద్ సిటీ సెక్యురిటి కౌన్సిల్ ఆద్వర్యం లో ట్యాంక్ బండ్ పై బాలల దినోత్సవం నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్బంగా 45 స్కూల్స్ నుంచి 40 విద్యార్థులని ఎంపిక చేసి మెడల్స్, ప్రశంస పత్రాల ప్రదానం చేసారు. గత సంవత్సర కాలంగా నగరం లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు. ప్రతి ఇంట్లో ఒక పోలీస్ అనే కాన్సెప్ట్ తో నిర్వహిస్తున్నారు WECOP ప్రోగ్రాం. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆద్వర్యం లో సర్టిఫికెట్ ప్రదానం చేసారు. ట్రాఫిక్ రూల్ పాటించడం,హెల్మెట్ ప్రాధాన్యత, సౌండ్ పొల్యూషన్ వంటి అంశాల పై ఈ ప్రోగ్రామ్ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ… మనం అందరo ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఫ్యూచర్ లో పిల్లలు కూడా అవే అలవాటు చేసుకుంటారు. బాలల దినోత్సవం రోజు ఈ ప్రోగ్రాం జరుపుకోవడం హ్యాపీ మూమెంట్. సరదాలకు పోయి ప్రాణాంలమీదకు తెచ్చుకోవద్దు అని సూచించారు. మొత్తం పది వేల మంది పిల్లలకు సర్టిఫికేట్ ప్రదానం చేస్తున్నాం. అందరికి వారి వారి స్కూల్ నుంచి మెడల్స్ అందుతాయి అని పేర్కొన్నారు.