NTV Telugu Site icon

బిర్యానీ బాగాలేద‌న్నార‌ని… రెస్టారెంట్ యాజ‌మాన్యం దాడి…

హైద‌రాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమ‌స్సో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ఇక్క‌డి నుంచి దేశ విదేశాల‌కు ఎగుమ‌తి అవుతుంటుంది.  ఏ రెస్టారెంట్‌లో చూసుకున్నా బిర్యాని రుచి అద్భుతంగా ఉంటుంది.  లాక్‌డౌన్ స‌మ‌యంలో కూడా బిర్యానీకే హైద‌రాబాదీలు మ‌క్కువ చూపారు.  ఇక ఇదిలా ఉంటే, మైలార్‌దేవుల‌ప‌ల్లి మెఫిల్ రెస్టారెంట్‌లో బిర్యానీ బాగాలేద‌ని ప్ర‌శ్నించిన ఇద్ద‌రు యువ‌కుల‌ను యాజ‌మాన్యం చిత‌క‌బాదింది.  

Read: సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు…

దీంతో మైఫిల్ రెస్టారెంట్‌పై కేసులు న‌మోదు చేశారు.  ప‌బ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ క్రియోట్ చేసినందుకు 70(సి) సెక్ష‌న్ కింద కేసులు న‌మోదు చేశారు.  లాక్‌డౌన్ స‌మ‌యంలో ర‌హ‌స్యంగా వెనుక నుండి మైఫిల్ నిర్వాహ‌కులు రెస్టారెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు.  లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు రెస్టారెంట్‌ను నిర్వ‌హిస్తున్నార‌ని మైఫిల్‌పై కేసులు న‌మోదు చేశారు.