Site icon NTV Telugu

సీటీలో సెకండ్‌ ఛానల్‌ బ్యాంకు పేరుతో మోసం

ఎంత జాగ్రత్తగా ఉన్న రోజుకో పద్ధతితో మోసాలకు పాల్పడే వారు అదే పనిగా తమ చేతి వాటం చూపిస్తున్నారు.. ఇటీవల కాలంలో ఈ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సీటీలో నకిలీ సెంకడ్‌ ఛానల్‌ బ్యాంకు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతోఈ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెకెండ్‌ ఛానల్‌ ముసుగులో పలువురు వ్యక్తులతో పరిచయం ఏర్పరుచుకుని, బాధితులకు మంచి ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రాసెసింగ్‌ ఛార్జీల కోసం ముందే డబ్బు చెల్లించాలని చెప్పారు. డబ్బు తిరస్కరించినట్టు నటిస్తూ లావాదేవీల కోసం అనేక సార్లు చెల్లించేలా ప్లాన్‌ చేస్తున్నారు.

ఇలా వివిధ రాష్ర్టాల నుంచి ఈ ముఠా కోట్లలో డబ్బు వసూలు చేసిందన్నారు. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు,పరారీలో మరో నలుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో దమ్మయిగూడకు చెందిన లోన్‌ ఏజెంట్లు కూడా ఉండటంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పూర్తి విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Exit mobile version