Pocharam Srinivas Reddy: చరిత్రను తిరగరాస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. బాన్సువాడ నుంచి పోచారం 23,582 ఓట్లతో గెలిచారు. స్పీకర్ గా ఉంటూ విజయం సాధించడం చాలా అరుదు. కానీ ఈ సంప్రదాయాన్ని ఆయన తిరగరాశారు.
అంతకుముందు తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న మధుసూదనాచారి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. భూపాలపల్లి నియోజవర్గం నుంచి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అయిన గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో పరాజయం చవి చూశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో భాగంగా గండ్ర బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Read Also: BJP Victory: బీఆర్ఎస్ మంత్రికి షాక్.. బీజేపీ అభ్యర్థి గెలుపు
అయితే స్పీకర్ గా ఉన్న వ్యక్తులు ఎక్కువగా శాసనసభ కార్యకలాపాలపైనే దృష్టి పెడతారని, నియోజవర్గానికి అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. స్పీకర్‌గా ఉండే వ్యక్తి అధికార, ప్రతిపక్షాల మధ్య సమన్వయం చేస్తుంటారు, ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయకుండా ఉండాలి. స్పీకర్ గా ఉన్న వ్యక్తి తన నియోజకవర్గంలో తాను గెలిచిన పార్టీని రిప్రజెంట్ చేయలేరు. దీంతోనే సాధారణంగా స్పీకర్‌గా ఉన్న వ్యక్తి తర్వాత ఎన్నికల్లో గెలవడని చెబుతుంటారు. కానీ ఈసారి పోచారం దానికి చెక్ పెట్టారు.