ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో, మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరుల సమక్షంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. వీరితోపాటు భాను ప్రసాద్, దండే విఠల్, కోటిరెడ్డి లు కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆయా జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
కాగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పదవీ ప్రమాణం తర్వాత ఆయనకు మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవడంతోపాటు, తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని, పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణం చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో…. రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, వరంగల్ మహానగర మేయర్ గుండు సధారాణి, భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జనగామ జెడ్పీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రైతు విమోచన సమితి చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు, టిఎస్ఐఐసీ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ఇన్ చార్జీ గ్యాదరి బాలమల్లు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు (మాజీ ఉప ముఖ్యమంత్రి) కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, తక్కెళ్ళపల్లి రవిందర్ రావు, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేశ్, (మాజీ ఉప ముఖ్యమంత్రి) రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్, శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ భవన్ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మెహన్, లింగాల ఘన్ పూర్ జెడ్పీటీసి గుడి వంశీధర్ రెడ్డి, కరిమిల్ల బాబూరావు, వై.సతీశ్ రెడ్డి, గొట్టిముక్కల కేశవ్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్ తదితరులు ఉన్నారు.
సిఎం కెసిఆర్, కెటిఆర్, మంత్రులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
ఇదిలా వుండగా, తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధినేత, సిఎం కెసిఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ కు, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రుణపడి ఉంటానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని హామీ ఇచ్చారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన నేతలందరికీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.