Site icon NTV Telugu

Secunderabad Fire Accident: సికింద్రాబాద్ ఘటనపై ప్రధాని, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Pm.modi Shocked Over Secunderabad Incident

Pm.modi Shocked Over Secunderabad Incident

PM.Modi shocked Over Secunderabad Incident: సికింద్రాబాద్‌ రూబీ లాడ్జి అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని, సీఎం కేసీఆర్. మృతుల కుటుంబాలకు పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ.2 లక్షలు ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తామని ప్రధాని మోడీ వెల్లడించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్, మృతుల కుటుంబాలకు 3 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

సికింద్రాబాద్‌ లో భారీ అగ్ని ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, బెంగాల్‌, ఒడిశా, విశాఖ వాసులుగా గుర్తించారు అధికారులు. రూబీ హోటల్‌ సెల్లార్‌ లో ఎలక్ర్టిక్‌ స్కూటర్ల షోరూం నిర్వహిస్తున్నారు. సెల్లార్‌ పై అంతస్తులో రూబి హోటల్‌ ను వుంది. అందులో వసతి పొందేందుకు పర్యాటకులు వస్తుంటారు. నిన్న సోమవారం రోజూలాగానే లాడ్జిలో వుండేందుకు చాలా మంది పర్యాటకులు వచ్చారు. నిన్న రాత్రి అందరూ ప్రసాంతంగా గాఢనిద్రలో నిద్రిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించింది. ఏం జరుగుతుంతో పరిశీలించగా.. రూబీ హోటల్‌ కింద ఫ్లోర్‌ లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కొందరు ఫైరింజన్లు సమాచారం అందించడంతో.. హుటాహుటిన ఘటనాస్థలానికి రెండు ఫైరింజన్లు చేరుకుని మంటలార్పే పనిలో పడ్డారు.

హోటల్‌ లోని వారిని కిందకి దించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, స్థానికులు. రూబీ హోటల్‌ లో ఎనిమిది మంది మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన వారిని అపోలో, యశోద, గాంధీలో ట్రీట్మెంట్‌ కొనసాగుతుంది. ప్రమాద సమయంలో మొత్తం 30 మందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది వున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు.. లాడ్జీ ఓనర్ రంజిస్ సింగ్ బగ్గా ను అదుపులోకి తీసుకుని విచారిస్తు్న్నారు. ఎలక్ట్రానిక్ బైక్ బాటరీ పేలుడే ప్రమాదానికి కారణమా..? లేదా ఎలక్ట్రిక్ షాట్ సర్క్యూట్ కారణమా..? బిల్డింగ్ అనుమతలు, బైక్స్ షోరూం, లాడ్జీ నిర్వాహణ అనుమతులపై, ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఫైర్ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ క్లూస్ సేకరించే పనిలో పడింది. ఘటనపై స్థానిక ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు విచారణ వేగమంతం చేసారు.

Exit mobile version