NTV Telugu Site icon

PM Modi: నేడు వరంగల్ లో మోడీ పర్యటన.. వేములవాడ స్వామివారికి ప్రధాని ప్రత్యేక పూజలు

Modi

Modi

PM Modi: రాజన్నసిరిసిల్ల జిల్లా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వేములవాడ, రాజన్న సిరిసిల్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మద్దతుగా మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వేములవాడకు బయలుదేరుతారు. వేములవాడ రాజన్నకు కోడేమొక్కులు చెల్లించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కోర్టు పక్కన గల మైదానంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. గుడి చెరువులో హెలిప్యాడ్ ను అధికారులు సిద్ధం చేశారు. 1200 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వేములవాడ నుంచి ఉదయం 11.05 గంటలకు బయలుదేరుతారు. ఉదయం 11.45 గంటలకు మామునూర్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 11.55 గంటలకు బహిరంగ సభ వేదికపైకి చేరుకుని.. మధ్నాహ్నం 12 నుంచి 12.50 వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్నాహ్నం 12.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.

Read also: పుష్ప తో నా క్రేజ్ ఏం పెరగలేదు..ఫహాద్ షాకింగ్ కామెంట్స్…

అనంతరం వరంగల్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.00 గంటలకు వేములవాడ నుండి హెలికాప్టర్ లో మామునూరుకు చేరుకుంటారు. ఆ పక్కనే ఉన్న లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి మోడీ పర్యటన సందర్భంగా బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వరంగల్ జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Read also: DC vs RR: తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చహల్!

నేడు ప్రధాని మోడీ మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు బయలు దేరనున్నారు. తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో రాజంపేట కలికిరికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు కలికిరిలో ప్రధాని మోడీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ బయలు దేరనున్నారు. అనంతరం సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన బందర్‌ రోడ్డు ఇందిరా గాంధీ స్టేడియంకు బయలు దేరనున్నారు. స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోడీ రోడ్‌ షో నిర్వహించనున్నారు. అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ పయనం కానున్నారు.
DC vs RR: తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చహల్!