NTV Telugu Site icon

PM Modi : కామారెడ్డి బాధితుల‌కు PMRF ప్ర‌క‌టించిన‌ ప్ర‌ధాని

Modi

Modi

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపుతోంది. అయితే ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోదీ నిర్ఘాంత పోయారు. మృతుల కుటుంబాలకు సానుభూతి, గాయపడిన వారితో ప్రార్థనలని త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మరణించిన వారి బంధువులకు అందజేయబడుతుందని తెలిపారు. గాయపడిన వారికి రూ. 50వేలు అందించ‌నున్న‌ట్లు ప్రధాని మోదీ ట్విట‌ర్ ద్యారా వెల్ల‌డించారు.

కాగా .. కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది మృతి చెందడం బాధాకరమ‌ని క‌విత అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని కవిత అన్నారు.

కాగా,కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నిజాంసాగర్‌ మండలం హసన్ పల్లి గేట్ దగ్గర జరిగింది. టాటా ఏస్‌ వాహనం, లారీ ఢీకొనడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. బాన్స్‌వాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.

మృతులు పిట్లం మండలం చిలర్గికు చెందిన వారిగా గుర్తించారు. ఎల్లారెడ్డిలో బంధువుల దశ దినకర్మకు వెళ్లి.. సొంతూరికి తిరిగి వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన స్థలంలో డ్రైవర్ సాయిలు(35), హంసవ్వ, లచ్చవ్వ(77), బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తుండగా దేవయ్య, కేశయ్య చనిపోయారు. చికిత్స పొందుతూ అంజవ్వ(35) అనే మహిళ చనిపోయింది. ప్రమాద సమయంలో ట్రాలీ ఆటోలో మొత్తం 22 మంది ప్రయాణించారు. ఈ ప్ర‌మాదం విష‌యం తెలిసిన వెంట‌నే ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు 2 లక్ష‌లు, గాయ‌ప‌డిన వారికి 50వేల రూపాయ‌లు ప్ర‌క‌టించారు.

PM Kisan: రైతులకు గమనిక.. ఈనెల 31 వరకే గడువు