NTV Telugu Site icon

ప్లాట్ రిజిస్ట్రేషన్ పేరుతో భారీ మోసం.. అరెస్ట్

ఇటీవల హైదరాబాద్ నగరంలో మోసాలు పెరిగిపోతున్నాయి. అవసరాలను అవకాశంగా మలుచుకుని సొమ్ము చేసుకునే మాయగాళ్ల మాటలతో కొందరు మోసపోతున్నారు. తాజాగా నగరంలో ప్లాట్ రిజిస్ట్రేషన్ పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడిన ఘరానా మోసగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అబ్దుల్ రషీద్ 15 మందికి ప్లాట్స్ ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి 5 కోట్లు వసూలు చేశాడు. 5 కోట్ల రూపాలయలు తీసుకుని ప్లాట్స్ ఇప్పించకుండా సొంత ఖర్చులకు వాడుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. చాంద్రాయగుట్టలో రషీద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.