దేశరాజకీయాలు మార్చేస్తా.. బీజేపీయేతర ఫ్రంట్ దిశగా అడుగులు వేద్దాం అంటూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంతనాలు జరుపుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. శనివారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లోనే ప్రశాంత్ కిషోర్ వున్నట్టు తెలుస్తోంది. ఆదివారం కూడా ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్ వుండబోతున్నారని, వీరిద్దరి మధ్య జాతీయ రాజకీయాలపై చర్చ సాగుతోందని అంటున్నారు.
సీఎం కేసీఆర్ ఇంతకుముందే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ తో కలిసి నడుస్తామని అన్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రగతిభవన్ చేరుకున్న పీకే, సీఎంతో రాజకీయ చర్చలు జరిపారు. ఆదివారం కూడా పీకే–కేసీఆర్ మధ్య చర్చలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో చర్చలు జరుపుతుండటం విశేషంగా చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం పీకే ఢిల్లీ తిరిగి వెళతారని అంటున్నారు. కాంగ్రెస్ తో కలిసి నడవనున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో పీకే-కేసీఆర్ భేటీ రసవత్తరంగా మారింది. వీరిద్దరి మధ్య ఏం చర్చలు జరిగి వుంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వే వివరాలు, ముందస్తుగా ప్రకటించినట్టుగా టీాఆర్ ఎస్ తో కలిసి నడవాలని పీకే భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని గురించి చర్చించారని రాజకీయవర్గాలు అంటున్నాయి.
Read Also: Venkaiah Naidu: ఉపరాష్ట్రపతికి తప్పని నకిలీల బెడద.. వెంకయ్య పేరుతో ఫేక్ మెసేజ్‌లు..
