NTV Telugu Site icon

Kondagattu Chori: కొండగట్టు చోరీ కేసు.. దొంగలు ఆలయంలో ఎలా వెళ్లారంటే..

Konda Gattu Temple

Konda Gattu Temple

Kondagattu Chori: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నిత్యం భక్తులతో ఉండే అంజన్న ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగతనం జరిగడం తీవ్ర కలకలం రేపింది. ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన కొండగట్టులో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడి భీభత్సం సృష్టించారు. ఈనేపత్యంలో ఇవాల ఉదయం కొండగట్టు ఆలయచోరీలో సీసీ ఫుటేజ్‌లోని దొంగల ఫొటోలను జిల్లా పోలీసులు విడుదల చేసారు. మొఖానికి మాస్క్‌ వేసుకుని చేతిలో దొంగలించిన గుడి వస్తువులను తీసుకుని వెళుతున్న ఫోటోలను విడుదల చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 2 కిలోల స్వామి మకరతోరణం, అర్థమండపంలో ఆంజనేయ స్వామి వారి వెండి మకర తోరణం ఎత్తుకెళ్లారు. ఇది ఐదు కిలోల వరకు ఉంటుందని, 3 కిలోల శఠగోపాలు ఎత్తుకెళ్లారు. మొత్తం 15 కిలోల వరకు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వీటి విలువు సుమారు రూ. 9 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వీరిని పట్టుకునేందుకు 10 పొలీస్ బృందాలు గాలింపు చేపట్టారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గురువారం రాత్రి స్వామి వారి పవళింపు సేవ అనంతరం గుడి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి వెల్లిపోయారు. శుక్రవారం వేకువ జామున ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుంచి దొంగలు పడ్డట్లు గుర్తించారు.

Read also: Harish Rao: ప్రీతి కుటుంబ సభ్యులకు హరీశ్‌ పరామర్శ.. దోషులను శిక్షిస్తామ‌ని హామీ

13 మంది అధికారులు పహారాకాస్తున్నా చోరీ ఎలా?

ఇది ఇలా ఉంటే కొండగట్టు ఆలయం వద్ద ఒక ASI, నలుగురు హోమ్ గాడ్స్, ఎనిమిది మంది సెక్యూరిటీ గాడ్స్ ఉండగా చోరీ జరిగడం చర్చకు దారితీస్తోంది. కొండగట్టు దేవస్థానం లో స్వామి వారి మాకటాతోరణం, శటరి ఎత్తుకెళ్లారు దొంగలు. ఆలయంలో చోరీ జరుగుతున్న సమయంలో వీల్లందురు ఎక్కడ వున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆంజనేయ ఆలయంలోనే చోరీకి పాల్పడుతున్నా అధికారులు ఎక్కడికి వెళ్లి వుంటారని స్థానికులు ముక్కుమీద వేలువేసుకుంటున్నారు. అంతగొప్ప ఆలయంలోనే అంత మంది అధికారులు పడిగాపులు కాస్తున్న చోరీ చేశారంటే ఇది అధికారుల నిర్లక్ష్యం కారణంగానే దొంగలు చోరీకి పాల్పడ్డారని స్థానిక ప్రజలు అంటున్నారు. ఆలయం మూసివేసి చోరీకి పాల్పడిన దొంగలను వెతకండ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. ఆలయ ద్వారాలు తెరచి శుద్ది చేసి, శ్రీ ఆంజనేయ స్వామి వారికి యధాప్రకారం పూజలు కొనసాగించాలని కోరుతున్నారు. ఆలయంలోనే చోరీకి పాల్పడిన దొంగలను త్వరగా పట్టుకుని కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు.
Bandi sanjay: ప్రీతి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు