Site icon NTV Telugu

Phone Tapping Case : కేసీఆర్‌ లేఖపై స్పందించిన సిట్..

Sit

Sit

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగం సిద్ధం చేసింది. గురువారం నాడు నందినగర్‌లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూనే, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కోరుతూ ప్రత్యుత్తరం ఇచ్చారు.

Mood of the Nation survey 2026: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఎవరిది అధికారం..? ఆసక్తికరంగా సర్వే ఫలితాలు..

సిట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం శుక్రవారం (జనవరి 30) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో తాను విచారణకు రాలేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కారణంతో విచారణను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మరో తేదీని ఖరారు చేయాలని సిట్ అధికారులను కోరారు.

తనను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని, భవిష్యత్తులో నోటీసులు కూడా అక్కడికే పంపాలని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ పంపిన లేఖపై సిట్ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఆయనకు సమయం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే, తదుపరి విచారణ తేదీ ఎప్పుడు ఉండబోతోంది? ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు సిట్ అధికారులు ఎప్పుడు వెళ్తారు? అనే అంశాలపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులను సిట్ సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.

Post Office Scheme: ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెడితే.. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకోవచ్చు!

 

Exit mobile version