ఖమ్మం జిల్లా తల్లంపాడు దగ్గర పెట్రోల్ ట్యాంకర్ అదుతప్పి నిలిచిపోయింది.. అయితే, పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడకుండా.. డ్రైవర్ కంట్రోల్ చేయగలిగాడు.. కానీ, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బకెట్లు, క్యాన్లు, డబ్బాలతో ఎగబడ్డారు.. నేనంటే.. నేను అంటూ పోటీపడ్డారు.. ట్యాంకర్ నుంచి పెట్రోల్ ఖాళీ చేశారు.. అయితే, ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్‌ను అదుపుచేయడానికి, పెట్రోల్ తీసుకెళ్తున్న జనాన్ని కంట్రోల్ చేయడానికి కొద్ది సేపు ప్రయత్నం చేశాడు డ్రైవర్.. పెద్ద ఎత్తున జనం రావడంతో.. అదుపు చేయడం తనవల్ల కాలేదు.. దీంతో, మొత్తం ట్యాంకర్ పెట్రోల్ ఖాళీ చేసినట్టుగా తెలుస్తోంది..
Read Also: Chandrayanagutta Flyover: రాజాసింగ్ ఎఫెక్ట్‌తో వాయిదా.. ఇవాళే చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం
కాగా, గతంలోనూ ఇలాంటి ఘటనలో చాలానే జరిగాయి.. ప్రమాదానికి గురైన పెట్రోల్ ట్యాంకర్ నుంచి ఎగబడి పెట్రోల్ ఎత్తుకెళ్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఇక, లిక్కర్ లోడ్‌తో వెళ్తున్న ఓ వాహనం బోల్తా పడితే.. అందులోని లిక్కర్ బాటిళ్లను మొత్తం ఎత్తుకెళ్లిన సందర్భాలున్నాయి.. అంతేకాదు.. ఆ మధ్య కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్ బోల్తా పడితే.. అందులోని కోళ్లను మొత్తం తీసుకెళ్లిపోయారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. ప్రమాదానికి గురైన ట్రక్.. కోళ్లను కాపాడడానికి పోటీ పడ్డ జనం అంటూ.. అప్పట్లో సరదాగా కాంమెట్లు పెట్టారు నెటిజన్లు.