హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆల్‌టైమ్ స్థాయిలో ధరలు నమోదయ్యాయి. లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు పెరగ్గా, డీజిల్‌పై 31 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో రూ.100.26 పైసలకు చేరింది. పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన సంగతి తెలిసిందే. దేశంలో పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ ఆంధోళనలు చేస్తున్నది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో రికార్డ్ స్థాయిలో పెట్రోల్ ధరలు…
