NTV Telugu Site icon

Bhatti Vikramarka: భట్టి పాదయాత్ర @100డేస్.. ట్విటర్లో #PeopelsMarch100Days ట్రెండింగ్

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెంచుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముందుకు సాగుతుంది. భట్టి విక్రమార్క పాదయాత్ర నేటితో వందరోజుల పూర్తి చేసుకుంది. నేడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగుతుంది భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. భట్టి పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెళ్లివిరుస్తోంది. భట్టి విక్రమార్క పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం ఉప్పల్ పాడు గ్రామంలో పాదయాత్ర శిబిరం వద్ద కేక్ కటింగ్ చేసి, బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు పార్టీ శ్రేణులు. కేతేపల్లి ప్రజలు భట్టికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు. భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు #PeopelsMarch100Days అనే హ్యష్‌ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. భట్టి పాదయాత్రకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్ని ఒడిదుడుకుల ఎదురైనా పాదయాత్రతో ముందుకు సాగుతున్న భట్టి విక్రమార్కను అభినందిస్తున్నారు. ట్విట్టర్‌ వేదికగా రాజకీయ నాయకులు, ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు భట్టి విక్రామార్కకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Read also: Minister KTR: రాజ్‌నాథ్‌ కు నాలుగు రిక్వెస్ట్‌లు ఇచ్చాం.. స్పందించి సాయం అందిస్తే సంతోషం

నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్ ఏర్పాటు చేయనున్నారు.. రాత్రికి కొప్పోలు గ్రామంలో బస చేయనున్నారు భట్టి విక్రమార్క. అనారోగ్య సమస్యకారణంగా తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చిన భట్టి విక్రమార్క. నేటి నుంచి తిరిగి పీపుల్స్‌ మార్చ్‌ని ప్రారంభించనున్నారు.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పాదయాత్ర చేయవచ్చని డాక్టర్లు సూచించడంతో.. డాక్టర్ల సూచన మేరకు నేటి టినుండి పాదయాత్ర ప్రారంభించారు. 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం బజరహాత్నూర్ మండ‌లం పిప్పిరి గ్రామం నుంచి పాద‌యాత్రను ప్రారంభించారు భట్టి. పాదయాత్ర సమయంలో భట్టి కొన్నిసార్లు అస్వస్థతకు గురికావడం, కొన్ని ప్రతీకూల పరిస్థితులు ఎదురైనా రెండు మూడు మార్లు పాదయాత్రకు బ్రేక్‌ పడింది. ఆ తరువాత పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజల్లో మమేకమై అందరి బాధలను వింటూ ముందుకు సాగిన భట్టి పాదయాత్ర నేటితో 100వ రోజుకు చేరుకుంది.


OG: ఒకరి తర్వాత ఒకరు డ్యూటీ ఎక్కుతున్నారు ఏంటి సర్?