Site icon NTV Telugu

గోదావరిఖనిలో భారీ అగ్నిప్రమాదం.. 11 లక్షల ఆస్తి నష్టం

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో భారీ అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖనిలోని లక్ష్మీనగర్ ఫ్యాషన్ వరల్డ్ మెన్స్ వేర్ లో తెల్లవారు జామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే బట్టలకు సంబంధించిన దుకాణం కావడంతో మంటలు భారీగా చెలరేగి ఆగ్నికీలలు పక్కనే ఉన్న దుకాణాలపై పడి మంటలు వ్యాపించాయి.

ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసకువచ్చారు. అయితే మెన్స్‌ వేర్‌ పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు, సుమారు 11 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు.

Exit mobile version