Minister Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. విపత్తును ఎదుర్కోవడానికి మా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దిగువకు వదులుతున్నామన్నారు. విపత్తును ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Read also: Medaram Forest: మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం.. 50 వేలకు పైగా చెట్లు నేలమట్టం..
భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు పర్యటించిన విషయం తెలిసిందే. జిల్లా సరిహద్దులోని పెంగంగ నది ప్రవాహాన్ని స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం పరిశీలించారు. వానాకాలం వచ్చిందని, పంటలు నీటమునిగిపోతున్నాయని పలువురు రైతులు మంత్రికి తెలిపారు. పెంగంగ పరిహాక ప్రాంతంలో కట్టలు నిర్మించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రిని కోరారు. వరద సహాయక చర్యల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వర్షం తగ్గిన తర్వాత పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు అండగా నిలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముంపునకు శాశ్వత పరిష్కారం కోసం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. పరిస్థితిని బట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
Hyderabad Hydra: రాష్ట్రంలో హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్..