NTV Telugu Site icon

Peddapalli: పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

Peddapalli

Peddapalli

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని రాఘవపూర్, కన్నాల మధ్యలో రాగానే ఒక్కసారిగా 11 భోగీలు పట్టాలపై బోల్తా పడ్డాయి. స్థానికులు గుర్తించి రైల్వేశాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. పట్టాలపైనే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు ఆగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు ఎక్కడికక్కడ ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ప్రమాదానికి గురైన గూడ్స్ రైలు గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. మూడు ట్రాక్ లు దెబ్బతిన్నాయని తెలిపారు. భారీ క్రేన్ లతో పట్టాల పై పడ్డ బోగీలను అందులో ఉన్న మెటీరియల్ సిబ్బంది తొలగిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సుమారు 20 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. 18 రైళ్లు దారిమల్లించామని పాక్షికంగా 4 రైళ్ల రద్దు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?